వ్యవసాయేతర రుణాలూ ఇవ్వాలి : నాబార్డు

ABN , First Publish Date - 2022-09-10T05:58:16+05:30 IST

సహకార, గ్రామీణ బ్యాంకులు పంట రుణాలతో పాటు వ్యవసాయేతర, వ్యవసాయ అనుబంధ రుణాలు అందజేయాలని నాబార్డు రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌భాస్కర్‌ సూచించారు.

వ్యవసాయేతర రుణాలూ ఇవ్వాలి : నాబార్డు
సమావేశంలో మాట్లాడుతున్న నాబార్డు జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌భాస్కర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 9: సహకార, గ్రామీణ బ్యాంకులు పంట రుణాలతో పాటు వ్యవసాయేతర, వ్యవసాయ అనుబంధ రుణాలు అందజేయాలని నాబార్డు రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌భాస్కర్‌ సూచించారు. శుక్రవారం స్థానిక సుభా్‌షరోడ్డులోని ఏడీ సీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో రాయలసీమ స్థాయి సహకార, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు.  నాబార్డు అందజేసే నిధులతో విరివిగా రుణాలు అందజేసి ఆయా బ్యాంకుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో తమ బ్యాంకు అన్ని విభాగాల్లో వెనుకబడి ఉందని, పురోగతి సాధించేందుకు సమష్టి కృషి చేస్తామని ఏడీసీసీ బ్యాంకు చైర్‌ పర్సన లిఖిత అన్నారు.  సమావేశంలో ఎల్‌డీఎం నాగరాజ రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ సురేఖరాణి, ఓఎస్డీ దినే్‌షకుమార్‌, డీజీఎం రవికుమార్‌, రాయలసీమ జిల్లాల సహకార, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

Read more