‘చెరువు వంకలో రోడ్డు వద్దు’

ABN , First Publish Date - 2022-05-30T06:50:43+05:30 IST

మండలపరిధిలోని కుంట్లపల్లివాండ్లపల్లి సమీపంలో పొలాల మధ్యఉన్న ఎర్ర గుంట చెరువు వంక లో రోడ్డు వేయ డానికి చేపట్టిన పనులను సంబంధి త రైతులు అడ్డుకు న్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

‘చెరువు వంకలో రోడ్డు వద్దు’
కాయలవాండ్లపల్లికి వెళ్లడానికి రోడ్డు వేస్తున్న వంక ఇదేనల్లచెరువు, మే 29: మండలపరిధిలోని కుంట్లపల్లివాండ్లపల్లి సమీపంలో పొలాల మధ్యఉన్న ఎర్ర గుంట చెరువు వంక లో రోడ్డు వేయ డానికి చేపట్టిన పనులను సంబంధి త రైతులు అడ్డుకు న్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట చెరువు వంకలో రోడ్డు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అక్కడ రోడ్డు వేయకూడని స్థానిక రైతులు తహసీల్దార్‌ మధునాయక్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్‌ స్పందించి సర్వేయర్ల్లను పంపారు. అయితే ఆ రైతులు తాము జిల్లా సర్వేయర్‌తో కొలతలు వేయిస్తామని, తమకు కొంత వ్యవధి కావాలని కోరడంతో స్థానిక సర్వేయర్లు వెనుదిరిగి వెళ్లారు. ఈ విషయమై ఆదివారం ఉదయం పోలీసులు రైతు కుటుంబ సభ్యులను పోలీస్‌ స్టేషనకు పిలిపించారు. వారక్కడ ఉండగానే కుంట్లపల్లి వద్ద వంకలో మళ్లీ రోడ్డు పనులు మొదలు పెట్టగా విషయం తెలుసుకు న్న మహిళరైతులు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక అక్కడ పనులు నిలిపివేసి, కాయలవాం డ్లపల్లి వద్ద నుంచి పనులు చేయిస్తున్నారు. రోడ్డు పనులు జరిగితే తమ పొలాలు నాశనమ వడంతో పాటు, వంక ఉఽధృతికి రోడ్డు కూడా ఉండదని రైతులు చెబుతున్నారు.  వంక పక్కనే ఉన్న పొలాలకు సంబంధించిన రైతులు కొంతమంది బెంగళూరులో ఉన్నారని, వారు సైతం వచ్చి సర్వే చేయించిన తరువాత రోడ్డు వేసుకోవాలని స్థానిక రైతులు విన్నవించారు. కాయలవాండ్లపల్లికి రోడ్డు  వేసేందుకు రెండుచోట్ల అవకాశం ఉందని  రైతు రామచంద్ర అంటున్నారు. అక్కడ రోడ్డు వేయకుండా చెరువు వంకలో వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించి తమ పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. 


Read more