జిల్లాలో ఎటుచూసినా మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-15T06:03:50+05:30 IST

No matter what you look at in the district, three months are fluttering

జిల్లాలో ఎటుచూసినా మువ్వన్నెల రెపరెపలు
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన పోలీసు పరేడ్‌ మైదానం

త్రివర్ణ శోభితం

నేడు స్వాతంత్య్ర వేడుకలు

పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబు

హాజరు కానున్న ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి

ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

అనంతపురం టౌన, ఆగస్టు14: జిల్లా త్రివర్ణ శోభితమైంది. సోమవారం స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఎటుచూసినా.. మువ్వన్నెల రెపరెపలు కనిపిస్తున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇళ్లపైన, వాహనాలకు జాతీయ జెండాను అలంకరించారు. ఎన్నడూలేని విధంగా ఈసారి స్వాతంత్య్ర వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అజాదీకా అమృత మహోత్సవ్‌ పేరుతో 15 రోజులుగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తోంది. జిల్లాలోనూ అధికారులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకానున్నారు. జెండాను ఆవిష్కరించి, ఉత్తమ సేవా అవార్డులు అందించనున్నారు. పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను ఆదివారం జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటుపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా శాఖలకు కేటాయించిన బాధ్యతల్లో అలసత్వం వహించరాదని ఆదేశించారు. స్టాల్స్‌, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


353 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు

అనంతపురం టౌన, ఆగస్టు14: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవార్డులు అందించడం ఆనవాయితీ. ఈసారి కూడా ఉత్తమ అవార్డులకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తూ ఆదివారం జంబో జట్టునే ప్రకటించింది. ఇందులో మొత్తం జిల్లావ్యాప్తంగా 353 మందికి ఉత్తమ అవార్డులు ప్రకటించారు. వీరిలో 49 మంది జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు. వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు మొత్తం 304 మందిని ఉత్తమ అవార్డులకు ఎంపిక చేశారు. వీరందరికీ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అవార్డులు అందించి, అభినందించనున్నారు.ఉత్సాహంగా ఫ్రీడమ్‌ రన

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర వేడుల సందర్భంగా ఆదివారం జేఎనటీయూలో ఫ్రీడమ్‌ రన నిర్వహించారు. కార్యక్రమంలో వీసీ రంగజనార్ధన, రెక్టార్‌ విజయకుమార్‌, రిజిస్ర్టార్‌ శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్‌ యూన్సివర్సిటీలో జరిగిన ర్యాలీలో వీసీ కోరి, డీన రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్కే యూనివర్సిటీలో సదాశివరెడ్డి, సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బైక్‌ ర్యాలీని రెక్టార్‌ మల్లికార్జున రెడ్డి, రిజిస్ర్టార్‌ ఎంవీ లక్ష్మయ్య ప్రారంభించారు.


నగరంలో పలుచోట్ల..

అనంతపురం క్లాక్‌టవర్‌: ఎన్టీఆర్‌ స్కేటింగ్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో జరిగిన ఆజాదీకా అమృత ర్యాలీలో కోచలు నాగేంద్ర, ఆంజనేయులు, అనిల్‌, హేమంత పాల్గొన్నారు. 

- లక్ష్మీనగర్‌లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ వెంకటరమణ, కోచలు రాణా ప్రతాప్‌, నరే్‌షకుమార్‌ గౌడ్‌, సంధ్య తదితరులు నివాళులర్పించారు.

- నెహ్రూ యువకేంద్రం, ఫిల్మ్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎనవైకే డీడీఓ శ్రీనివాసులు తదితరులు సర్టిఫికెట్లను అందజేశారు. Read more