సింహవాహనంపై నారసింహుడు

ABN , First Publish Date - 2022-03-16T06:03:08+05:30 IST

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారు సింహవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

సింహవాహనంపై  నారసింహుడు
సింహవాహనంపై శ్రీవారి విహారం

కదిరి, మార్చి 15: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారు సింహవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యాగశాల నుంచి విచ్చేసిన శ్రీవారికి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని సింహవాహనంపై అలంకరించి, ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. కదిరి నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తిరువీధుల్లో విహరిస్తూ శ్రీవారు.. భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ, ఈఓ పట్టెం గురుప్రసాద్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

నేడు హనుమంతవాహన సేవ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం హనుమంతవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నిత్యపూజ హోమాల అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం హనుమంతవాహనంపై కొలువుతీరి శ్రీవారు తిరువీధుల్లో విహరిస్తారు.


Read more