-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Name change of NTR Health University due to factionalism-NGTS-AndhraPradesh
-
కక్షపూరితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు
ABN , First Publish Date - 2022-09-27T06:05:27+05:30 IST
వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం పార్టీ మండ ల కన్వీనర్ జయప్ప ఆద్వర్యంలో స్థానిక బస్టాండు కూడలిలో రోడ్డుపై బైఠాయించి ని రసన వ్యక్తంచేశారు.

లేపాక్షి, సెప్టెంబరు 26: వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం పార్టీ మండ ల కన్వీనర్ జయప్ప ఆద్వర్యంలో స్థానిక బస్టాండు కూడలిలో రోడ్డుపై బైఠాయించి ని రసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత ఎన్టీరామారావు తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేశారని, అలాంటి మహానేత పేరు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. తన తండ్రిపై జగన్మోహనరెడ్డికి ప్రేమాభిమానాలుంటే మరింత అభివృద్ధి చేసి దానికి ఆయన పేరు పెట్టుకోవాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పీ ఆనంద్‌కుమార్, శిరివరం కిష్టప్ప, తెలుగు మహిళ నాయకురాళ్లు రామాంజినమ్మ, మాలక్క, నాయకులు మారుతిప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, శెక్షావలి, మాజీ సర్పంచులు, తె లుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.