మద్యం సేవించి వేధిస్తున్నాడని హత్య

ABN , First Publish Date - 2022-09-30T04:42:07+05:30 IST

పట్టణంలోని గాంధీకట్టవద్ద గురువారం తెల్లవారుజామున భర్త అబ్దుల్‌బాషా (26)ను భార్య అయేషా రోకలిబండతో తలపై బాది హత్యచేసిందని ఎస్‌ఐ ధర ణీబాబు తెలిపారు.

మద్యం సేవించి వేధిస్తున్నాడని హత్య
అబ్దుల్‌బాషా మృతదేహం

 తాడిపత్రిటౌన్‌, సెప్టెంబరు 29: పట్టణంలోని గాంధీకట్టవద్ద గురువారం తెల్లవారుజామున భర్త అబ్దుల్‌బాషా (26)ను భార్య అయేషా రోకలిబండతో తలపై బాది హత్యచేసిందని ఎస్‌ఐ ధర ణీబాబు తెలిపారు. లారీక్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌బాషా అతిగా మద్యం సేవించి తరచుగా భార్య ను చితకబాదేవాడన్నారు. చిత్ర హింసలు భరించలేక నిద్రిస్తున్న భర్తపై రోకలిబండతో బాది హత్యచేసిందన్నారు. హత్య ప్రదేశంలో ఉన్న అయేషాను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. మృతుని తల్లి షేక్‌ హసీనా ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశామన్నారు. మృతుడికి ఇరువురు పిల్లలు ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.


Read more