AP News: కళ్యాణదుర్గంలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-09-29T14:09:57+05:30 IST

జిల్లాలోని కళ్యాణదుర్గంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

AP News: కళ్యాణదుర్గంలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాత బస్టాండ్ సమీపంలో టీడీపీ నేతల వేసిన టెంట్‌లను అధికారులు తొలగించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిరసిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు రిలే దీక్షలకు సిద్ధమయ్యారు. పోలీసులు అనుమతి తీసుకొని పాత బస్టాండ్‌లో రిలే నిరాహార దీక్షకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీక్షకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారన్న సమాచారంతో టెంట్‌లను తొలగించి మున్సిపల్ ఆఫీస్‌కు తరలించారు. మున్సిపల్ అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read more