విలీన సమస్య జాతీయ స్థాయికి..

ABN , First Publish Date - 2022-08-01T06:07:14+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలల విలీన సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ‘

విలీన సమస్య జాతీయ స్థాయికి..
విద్యార్థులతో మాట్లాడుతున్న పీడీఎఫ్‌ ప్లోర్‌ లీడర్‌ బాలసుబ్రహ్మణ్యం

క్షేత్రస్థాయిలో రెట్టింపు సమస్యలు

మండలిలో నిలదీస్తాం 

బస్సు యాత్ర సభలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

అనంతపురం విద్య, జూలై 31 : రాష్ట్రంలో పాఠశాలల విలీన సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని  పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు  పేర్కొన్నారు. ‘బడి కోసం బస్సు యాత్ర’లో భాగంగా అనం తపురం జిల్లాకు వచ్చిన బస్సు యాత్ర ఆదివారం రాత్రి  ప్రభుత్వ వసతి గృహాల సముదా యంలో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ....పాఠశాలల విలీనం సమస్యలు  క్షేత్రస్థాయిలో భారీగా ఉన్నాయన్నారు.  దీనిపై  విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఆందోళన, ఆక్రోశం వ్యక్తమవుతోందన్నారు. కొన్ని చోట్ల స్కూళ్లు మానేస్తున్నారన్నారు. దీంతో విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లలు 2, 3 కిలోమీటర్ల దూరం ఎలా నడు చుకుంటూ ఎలా వెళ్తారంటూ...తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేద విద్యార్థులు చదువును దూరం చేస్తోందన్నారు. కేవలం ప్రపంచ బ్యాంకు, సాల్ట్‌ నుంచి అప్పుల కోసమే ప్రభు త్వం స్కూళ్ల మూసివేతకు తెరతీసిందంటూ మండిపడ్డారు. మరో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ... ఎక్కడికెళ్లినా...విలీనంపై ప్రజల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోందన్నారు. జాతీయ రహదారులు, నదులు, వాగులు కాలువలు పరిగణనలోకి తీసుకోకుండా విలీనం చేశారంటూ...తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అభిప్రాయాలను మండలిలో ప్రస్తావించి ఎండగడుతామన్నారు.  ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ... స్కూళ్లలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండు కొనసాగిం చాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను  పరిగణనలోకి తీసుకుని విలీనాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,  రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మిరాజా, కోటేశ్వరప్ప, జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య, ఇతర నాయకులు రమణయ్య, సరళ, రాఘవేంద్ర, ప్రమీల,  అర్జున, ఈశ్వరయ్య, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు పరమేష్‌, సూర్యచంద్రయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-01T06:07:14+05:30 IST