రాతిదూలం లాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-06-12T05:41:27+05:30 IST

మండలంలోని నక్కలపల్లిలో పోలిమేరమ్మ విగ్రహప్రతిష్ట సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగు డు పోటీలు ఉత్సహంగా పోటాపోటీగా జరిగాయి.

రాతిదూలం లాగుడు పోటీలు

 బెళుగుప్ప, జూన్‌ 11: మండలంలోని నక్కలపల్లిలో పోలిమేరమ్మ విగ్రహప్రతిష్ట సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగు డు పోటీలు ఉత్సహంగా పోటాపోటీగా జరిగాయి. ఈ పోటీలలో 12 జతల వృషబాలు పాల్గొన్నయి. మొదటి బహుమతికి కింద రూ.50వేలు సొములదొడ్డి, ద్వితీయ బహుమతి రూ.40వేలు గార్లదిన్నె, తృతీయ బహుమతి కింద రూ.30 వేలు గంగవరం వృషబాలు దక్కించుకున్నాయి. పయ్యావుల సోదరులు ఆధ్వ ర్యంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి పోటీలు తిలకించేందుకు వచ్చిన వారికి ఉచితంగా తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


Read more