అమ్మవారి బహురూప దర్శనం

ABN , First Publish Date - 2022-10-02T05:11:34+05:30 IST

పట్టణంలోని పలు దేవాలయాల్లో శరన్నవ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

అమ్మవారి బహురూప దర్శనం
బత్తలపల్లిలో శాకంబరిగా దుర్గాదేవి

ధర్మవరం, అక్టోబరు 1: పట్టణంలోని పలు దేవాలయాల్లో శరన్నవ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరో రోజైన  శనివారం ఆయా ఆలయాల్లో మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి వివిధ రూ పాల్లో కొలుపుదీర్చారు. భక్తులు పెద్దఎత్తున ఆలయాలకువెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానంగా చెన్నకేశవాలయంలోను, టీచర్స్‌కాలనీలో   చౌడేశ్వరిదేవి సంతానలక్ష్మిగా, కొత్తపేట వెంకటేశ్వరాలయంలో పద్మావతి  అన్నపూర్ణేశ్వరిగా, రాజేంద్రనగర్‌లో చౌడేశ్వరిదేవి మీనాక్షి అలంకరణలో భ క్తులకు దర్శినమిచ్చారు. శ్రీనివాసనగర్‌ వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన, లక్ష్మీనరసింహ హోమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  వైభవంగా నిర్వహించారు. అలాగే దుర్గమ్మదేవాలయంలో అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పొరాళ్లపుల్లయ్య, బృందం అన్నమయ్య సంకీర్తనలు గావించారు. 

ధర్మవరంరూరల్‌: మండలంలోని నాగలూరు వద్ద వెలసిన విజయదుర్గా దేవికి శనివారం దేవి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి అడవాల కేశవస్వామి అమ్మవారిమూలవిరాట్‌ను ఆకుపూజతో ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు.  

పుట్టపర్తి : దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు శనివారం వాసవీ కన్యకాపరమేశ్వరి మహాలక్ష్మిగా ప్రత్యేక పూజలందుకున్నారు. అలా గే దుర్గమ్మ, సత్యమ్మ, గాయత్రి, లక్ష్మీదేవి ఆలయాల్లో మహాలక్షి అలంకరణ చేసి పూజలు చేశారు. ప్రశాంతినిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో మూడోరోజు వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని కొనసాగించారు. రుత్వికులు మహాగణపతి హోమం, సర్వదేవతార్చన, నిర్వహించారు, యజ్ఞంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

పుట్టపర్తిరూరల్‌: దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా మండలవ్యాప్తంగా ఆమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి,  ఆరో రోజు శనివారం కోవెలగుట్టపల్లిలో దుర్గాదేవి, మామిళ్ళకుంట లలితా దేవి మహాలక్షిగా దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ కోవెల గుట్టపల్లి దుర్గాలయంలో పాశ్చాత్యులు  మహాలక్ష్మి హామం చేశారు. సాయంత్రం పల్లకిసేవ, లలితా సహస్రనామ పారాయణం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

బత్తలపల్లి: దేవీశరన్నవరాత్రుల్లో భాగంగా బత్తలపల్లిలో ఓంకారేశ్వరి లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ధర్మవరం రోడ్డులోని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. 

్లకదిరిఅర్బన: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని ఆలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చారు. చౌడేశ్వరిని జ్యేష్టా దేవిగా, కుమ్మరవాండ్లపల్లిలోని మల్లాలమ్మను అన్నపూర్ణగా అలంకరించారు. 

అమడగూరు: మండలపరిధిలోని తుమ్మల కొండపై వెలసిన వెంక టేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి శనివారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  స్థానిక చౌడేశ్వరీ దేవి ఆలయంలో, కొత్తపల్లిలోని కొదండ రామస్వామి ఆలయంలో, జౌకల కొత్తపల్లి వెంకటేశ్వర స్వామిఆలయంలో భక్తులు పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

్లనల్లచెరువు: స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం అమ్మవారు వెంకటేశ్వరస్వామి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని  ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నా అమ్మవారిని దర్శించుకున్నారు. 



Updated Date - 2022-10-02T05:11:34+05:30 IST