విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-01T05:21:31+05:30 IST

పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతానికి చెందిన శేఖర్‌ (50) అను వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

 రాయదుర్గం టౌన్‌, సెప్టెంబరు 30: పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతానికి చెందిన శేఖర్‌ (50) అను వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంట్లో పనిచేసుకుం టుండ గా మెయిన్‌వైరు ఇంటికి అర్త్‌ కావడం తో షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గుర్తించిన చు ట్టుపక్కల ప్రజలు చికిత్స నిమిత్తం రా యదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more