‘బాదుడే బాదుడు’ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-05-18T05:57:22+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబా బునాయుడు ఆధ్వర్యంలో జిల్లాలో సోమందేపల్లెల్లో ఈనెల 20న జరిగే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ కదిరి ని యోజకవర్గం ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొ న్నారు.

‘బాదుడే బాదుడు’ను జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌


20న సోమందేపల్లిలో కార్యక్రమం

హాజరుకానున్న చంద్రబాబు:  కందికుంట 

కదిరి, మే 17: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబా బునాయుడు ఆధ్వర్యంలో  జిల్లాలో సోమందేపల్లెల్లో  ఈనెల 20న జరిగే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ కదిరి ని యోజకవర్గం ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని న్యూ నెహ్నా ఫంక్షన హాల్‌లో మంగళవారం టీడీపీ క్లస్టర్‌ యూనిట్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పరిశీలకు లుగా మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, టీడీపీ నాయకులు ఆలం నరసానా యుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ...పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు విజయవంతం చేశామన్నారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పడంలో విజయవంతం అయ్యామన్నారు. వాటిని మరింతగా ప్రజలకు చేర్చడానికి బూత స్థాయి నుంచి ప్రతి ఒక్క రు కష్టపడాలని సూచించారు. ఈ నెల 20న సోమందేపల్లిలో జరిగే బాదు డే బాదుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. పరిశీలకులు జితేంద్రగౌడ్‌ మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. బూత స్థాయిలో ప్రతి ఇంటిని గుర్తించి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలన్నారు. పార్టీ కార్యకర్తలందరూ అతి విశ్వాసానికి పోకుండా పార్టీ విజయం సాధించేంతవరకు కృషి చేయాల న్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకురాలు ఫర్వీనాబాను, మోపూరి శెట్టి చంద్రశేఖర్‌, తెలుగుయువత నాయకులు బాబ్‌జాన,  డైమండ్‌ ఇ ర్ఫాన, నాగభూషణం నాయుడు, శివరాంప్రతాప్‌, రాజశేఖర్‌బాబు, అల్ఫా ముస్తఫా, రమణ, సలేమాన, టెలికం భాస్కర్‌, శేషు, అశ్వత్థనాయుడు, సోంపాళ్యం నాగభూషణం, నాగప్ప, సాలకి హనుమంతురావు, వడ్డె బాబు, ఉమాదేవి, రమణమ్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.


Read more