-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Magnificent Mahakumbhabhishekam of Chandramouleshwara-MRGS-AndhraPradesh
-
వైభవంగా చంద్రమౌళేశ్వరుని మహాకుంభాభిషేకం
ABN , First Publish Date - 2022-07-19T05:14:02+05:30 IST
పట్టణ సమీపంలోని పావగడ రో డ్డులో వెలసిన శ్రీచంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో సోమవా రం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు.

మడకశిర టౌన, జూలై 18: పట్టణ సమీపంలోని పావగడ రో డ్డులో వెలసిన శ్రీచంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో సోమవా రం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. వరుణుని కటాక్షం కోసం ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి వేదపడింతుల మంత్రోచ్ఛారణ మధ్య పూజలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి కుంభాభిషేకం, విరాటపర్వం, వరుణయాగం, రుద్రహోమం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం వేదపండితులు వరుణ జపం చేపట్టారు.
స్వామివారికి కుంభాభిషేకంతో వ రుణుని కరుణాకటాక్షాలు ఈ ప్రాంతంపై ఉండాలని వేడుకున్నారు. ఉదయం నుంచే స్వామి వారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు హాజరై స్వామికి విశేష పూజలు చేశారు. వరుణుడు కటాక్షంతో ఈప్రాంతం సస్యశ్యామలం కావాలని, పంట లు పండి అందరూ బాగుండాలని పూజలు నిర్వహించారు. అదేవిధంగా శివాపురం కాలనీ వాసులు మడకశిర చెరువు వద్ద ఉన్న అ క్కమ్మ దేవతకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వరుణ దేవుని కరుణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.