భానుడు భగభగ.. జనం ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2022-04-24T05:53:59+05:30 IST

ఎండలు మండుతున్నాయి. హిందూపురంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు అనంతపురంతో పోల్చితే తక్కువగా ఉంటాయి.

భానుడు భగభగ.. జనం ఉక్కిరిబిక్కిరి
నిర్మానుష్యంగా రహమతపురం సర్కిల్‌

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 23: ఎండలు మండుతున్నాయి. హిందూపురంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు అనంతపురంతో పోల్చితే తక్కువగా ఉంటాయి. కానీ ఈ యేడాది 15 రోజులుగా 37 డిగ్రీల సె ల్సియస్‌కు తగ్గకుండా, గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉదయం 9 గంటల నుంచి సెగ మొ దలవుతోంది. ఈఏడాది ఎండలు మండుతున్నాయని స్థానికులు వాపో తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఇదే స మయంలో పల్లెల్లో కరెంటు కోతలు అధికంగా ఉన్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.   దీనికారణంగా హిందూపురం పట్టణంలో మధ్యాహ్నం ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. దుకాణాల ముందు పార్క్‌చేసిన వాహనాలకు గోనెసంచులతో రక్షణ కల్పిస్తున్నారు. ఎండ ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. 


Updated Date - 2022-04-24T05:53:59+05:30 IST