టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

ABN , First Publish Date - 2022-11-12T00:01:45+05:30 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఆ యన సతీమణి ఉమాదేవి పట్టభద్రు లు, ఉద్యోగులను అభ్యర్థించారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

ధర్మవరం, నవంబరు 11: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఆ యన సతీమణి ఉమాదేవి పట్టభద్రు లు, ఉద్యోగులను అభ్యర్థించారు. ఆమె శుక్రవారం పట్టణంలోని సచివాలయాలు, ప్రభుత్వపాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో పర్యటించారు. రాంగోపాల్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమె వెంట 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్‌ భీమనేని ప్రసాద్‌నాయుడు తదితరులు ఉన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి

ఓబుళదేవర చెరువు, నవంబరు 11: టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమని టీడీపీ ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి బడిశం రామాంజనేయులు, హిందూపురం పార్లమెంటు తెలుగురైతు మీడియాకోఆర్డినేటర్‌ ఆర్‌ఎంపీ జాకీర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కొండకమర్ల పంచాయతీలో పశ్చిమ రాయలసీమ పట్టభుద్రల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపు కోసం వారు ప్రచారం నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించి రామగోపాల్‌ రెడ్డి విజయానికి కృషిచేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో నల్లమాడ మండల కన్వీనర్‌ మైలే శంకర్‌, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గంగాద్రి, నాయకులు నాయనకోట ఆంజనేయులు, జయచంద్రారెడ్డి, చెండ్రాయుడు, వినోద్‌నాయుడు, చంద్రారెడ్డి, సుధాకర్‌నాయుడు, ఆనంద్‌రెడ్డి, వెంకటేష్‌, నరేష్‌, లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-12T00:01:45+05:30 IST

Read more