-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Let make Reddicheruvupalli an IT corridor BK-MRGS-AndhraPradesh
-
రెడ్డిచెరువుపల్లిని ఐటీ కారిడార్ చేస్తాం : బీకే
ABN , First Publish Date - 2022-09-30T04:58:02+05:30 IST
టీడీపీ అధికారంలోకి రాగానే మండలంలోని రెడ్డిచెరువుపల్లి ప్రాంతాన్ని ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు.

గోరంట్ల, సెప్టెంబరు 29: టీడీపీ అధికారంలోకి రాగానే మండలంలోని రెడ్డిచెరువుపల్లి ప్రాంతాన్ని ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు. రెడ్డిచెరువుపల్లిలో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులతో కలిసి పార్థసారథి గ్రామ వీధుల్లో పర్యటించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీకే మాట్లాడుతూ వైసీపీ పాలకులు మూడున్నరేళ్లలో ఈ ప్రాంతానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ధరలు పెంచి, దోపిడీ చేస్తోందన్నారు. లేపాక్షి నాలెడ్జ్‌హబ్ పేరుతో 8800 ఎకరాల భూమిని సేకరించి, పరిశ్రమలు నెలకొల్పకపోగా.. జగన బంధువులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ భూముల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ నాయకులు సోమశేఖర్, అశ్వత్థరెడ్డి, భాస్కర్‌రెడ్డి, నరసింహమూర్తి, మనోహర్, మూర్తి, హరీష్, ఆదినారాయణ, కోగిర శ్రీనివాసులు, నరే్‌షకుమార్ యాదవ్, రవిమోహన, రంగనాయకులు, చంద్రశేఖర్, శ్రీనివాసులు, రమణ, రామాంజనేయులు, అక్కులప్ప, నరసింహప్ప, గోపాల్, చలపతి, వెంకటరాముడు, వీరనారాయణరెడ్డి, నారాయణస్వామి తది తరులు పాల్గొన్నారు.