నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2022-10-08T05:48:09+05:30 IST

అక్రమ కేసులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు న్యాయపరంగా లీగల్‌ సెల్‌ తరఫున అండగా ఉండాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కోరారు

నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలి
టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా నూతన కార్యవర్గం జాబితాను విడుదల చేస్తున్న కాలవ శ్రీనివాసులు

పార్టీ లీగల్‌ సెల్‌కుకాలవ శ్రీనివాసులు సూచన

టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు 

అనంతపురం అర్బన, అక్టోబరు 7: అక్రమ కేసులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు న్యాయపరంగా లీగల్‌ సెల్‌ తరఫున అండగా ఉండాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కోరారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఆ కార్యవర్గాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణతో కలిసి ఆయన ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. వీటిపై న్యాయపరంగా కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు. 


కార్యవర్గం: టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా లేపాక్షినాయుడు, ఉపాధ్యక్షులుగా నారాయణ, హనీఫ్‌ బాషా, నాగలింగం, రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా లోకానంద, అధికార ప్రతినిధులుగా నాగేంద్రకుమార్‌, గోవిందరాజులు, బాల రంగయ్య, శ్రీదేవి, లక్ష్మీనారాయణ, ఆదిశేషయ్య, కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా రామకృష్ణ, షాషావలి, పుష్పా, శ్రీనివాసులు, రామ్మోహనరెడ్డి, విజయ్‌కుమార్‌, వెంకటేశులు, ఏవీ మహే్‌షకుమార్‌, కార్యదర్శులుగా నాగప్ప, వీరాంజినేయులు, శ్రీధర్‌, రాజగోపాల్‌, లక్ష్మన్న, నారాయణస్వామి, ఎక్స్‌ అఫీషియో పర్సన్సగా హరికృష్ణ, చిన్నారాయుడు, అనిల్‌ను నియమించారు. 

Read more