శ్రీనివాసుడిగా ఖాద్రీశుడు

ABN , First Publish Date - 2022-10-05T04:57:53+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీనివాసుడిగా ఖాద్రీశుడు
తిరుమల వేంకటేశ్వరస్వామి అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత ఖాద్రీ నరసింహ స్వామి దివ్యరూపం

కదిరి, అక్టోబరు 4: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సుగంధద్రవ్యాలు, కదిరి మల్లెలు, ఇతర పుష్పాలతో అర్చకులు సుందరంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన నరసింహస్వామి వారు వెంకటేశ్వర స్వామి అలంకరణలో కనువిందు చేశారు. దుర్గాష్టమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈఓ ఈఓపట్టెం గురుప్రసాద్‌, పాలకమండలి చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  కాగా  బుధవారం విజయదశమి రోజున స్వామివారు సాయంత్రం అశ్వవాహనంపై  పుర వీధుల్లో విహరిస్తారు.


Read more