క్షతగ్రాతులను పరామర్శించిన కందికుంట

ABN , First Publish Date - 2022-09-12T04:46:03+05:30 IST

తలుపుల మం డలం బట్రేపల్లి సమీపంలోని రెక్కమాను క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్ట ణంలోని 24 వ వార్డుకు చెందిన వారు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. వా రిని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అదివారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

క్షతగ్రాతులను పరామర్శించిన కందికుంట
బెంగళూరులో బాఽధితుల బంధువులతో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌కదిరి అర్బన, సెప్టెంబరు 11 : తలుపుల మం డలం బట్రేపల్లి సమీపంలోని రెక్కమాను క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్ట ణంలోని 24 వ వార్డుకు చెందిన వారు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. వా రిని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అదివారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సఫా, మహమ్మద్‌, అహమ్మద్‌ను పలుకరించి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి ఖర్చుల కోసం తక్షణ సాయంగా వారికి రూ. 50వేలు అందజేశారు. వారు పూర్తిగా కోలుకునే వరకు  సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Read more