రేషన దుకాణాలను తనిఖీ చేసిన జేసీ

ABN , First Publish Date - 2022-05-18T06:22:27+05:30 IST

స్థానిక రెండు ప్రభుత్వ రేషన దుకాణాలను, మండలంలోని గజరాంపల్లి రేషన దుకాణాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కేతన గర్గ్‌ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రేషన దుకాణాలను తనిఖీ చేసిన జేసీ
జాయింట్‌ కలెక్టర్‌ కేతనగర్గ్‌తో మాట్లాడుతున్న ప్రజలు

పామిడి, మే 17 :  స్థానిక రెండు ప్రభుత్వ రేషన దుకాణాలను, మండలంలోని గజరాంపల్లి రేషన దుకాణాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కేతన గర్గ్‌ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  స్టాక్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే 7వ స్టోర్‌ను, గజరాంపల్లిలోని స్టోర్‌ను పరిశీలించారు. కార్డుదారులకు చక్కెర, కందిబేడలు క్రమం తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట  తహసీల్దార్‌ ఆర్‌వీ సునీతాబాయి, ఆర్‌ఐలు రాజేష్‌కుమార్‌, లత, వీఆర్వోలు రవికాంత, శ్రీకాంతరెడ్డి పాల్గొన్నారు.

 పారిశుధ్య సమస్య పరిష్కరించండి

స్థానిక నెహ్రూనగర్‌, బాలాజీ నగర్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని, తామంతా అనారోగ్యాలకు గురవుతున్నాయని ఆ ప్రాంత వాసులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతనగర్గ్‌ వద్ద వాపోయారు. మురుగునీరు ఖాళీస్థలాల్లో ఏళ్ల తరబడి నిలిచిపోయి దుర్వాసన వెదజల్లతోందని, దోమలు, పాములు, చీడ పురుగులకు నిలయంగా మారిందని అన్నారు.  అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Updated Date - 2022-05-18T06:22:27+05:30 IST