రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన జగన : బీకే

ABN , First Publish Date - 2022-10-12T05:24:56+05:30 IST

ఒక్క ఛాన్స అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి... రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతున్నారని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసార థి విమర్శించారు.

రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన జగన : బీకే
కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల నిరసన ప్రదర్శన

సోమందేపల్లి, అక్టోబరు 11: ఒక్క ఛాన్స అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి... రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతున్నారని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసార థి విమర్శించారు. మండలంలోని కావేటినాగేపల్లిలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో ఇంటింటా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. అనంతరం కొవ్వొత్తులతో నిరస న ప్రదర్శన నిర్వహించారు. బీకే మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి రా ష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. నిత్యావసర సరుకుల ధ రలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. దేశంలో మరెక్కడా లేదని విధంగా రా ష్ట్రంలో అధిక ధరలు భగ్గుమంటున్నాయని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి మరిచి అప్పుల ఆంధ్రప్రదేశలా మారుస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. పెనుకొండ ని యోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ఏ ఒక్క రోడ్డు వేయలేదన్నారు. గ్రామాల అభివృద్ధి గాలికి వదిలేసి తిరుగుతున్నాడని, మీ గ్రామానికి ఎమ్మెల్యే వస్తే ఏం అభివృద్ధి చేశావో చూపాలంటూ చొ క్కా పట్టుకుని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మండల కన్వీనర్‌ సిద్దలింగప్ప, చంద్రశేఖ ర్‌, మాగేచెరువు సర్పంచ నరసింహులు, వెంకటరాముడు, సూర్యనారాయణ, నాగమణి, సంజీవరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Read more