వృద్ధుల పొట్టకొట్టడం సిగ్గు చేటు

ABN , First Publish Date - 2022-12-30T00:11:17+05:30 IST

పింఛన్లు రద్దు చేసి, వృద్ధులు పొట్టకొట్టడం సిగ్గుచేటని సీపీఐ నాయకులు భగ్గుమన్నారు.

వృద్ధుల పొట్టకొట్టడం సిగ్గు చేటు

సీపీఐ నాయకులు

అనంతపురం విద్య, డిసెంబరు 29: పింఛన్లు రద్దు చేసి, వృద్ధులు పొట్టకొట్టడం సిగ్గుచేటని సీపీఐ నాయకులు భగ్గుమన్నారు. గురువారం సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో 11,12,13,14,15 సచివాలయాల పరిధిలోని వృద్ధులకు పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇవ్వడంపై నాయకులు రాజమ్మకాలనీ సచివాలయం వద్ద నగర సమితి కార్యవర్గ సభ్యులు చాంద్‌ బాషా అధ్యక్షతన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లను ముఖ్యమంత్రి అర్ధంతరంగా తొలగించడం దారుణమన్నారు. గతంలో రాష్ట్రమంతా తిరుగుతూ...అవ్వతాతలకు ముద్దులు ఇచ్చిన వైఎస్‌ జగన, ఇప్పుడు...రద్దు చేసి వారిపై పిడిగుద్దులు గుద్దుతున్నారన్నారు. ఇటీవల గడప గడపకు కార్యక్రమంలో 23 ఏళ్ల బుద్ధిమాంద్యురాలికి రూ. 3వేలు పింఛన ఇప్పిస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే చెప్పి వెళ్లారని, ఇప్పుడు ఉన్న పింఛన కూడా ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. సీఎం దుర్మార్గపు పాలనకు ప్రజలు దగ్గరలోనే చరమగీతం పాడుతారంటూ ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా, రామాంజనేయులు, ఎల్లుట్ల నారాయణస్వామిబంగారు బాషా, మున్నా, జమీర్‌, శ్రీవాఆసులు, రాజు, రవికుమార్‌, కృష్ణుడు, మోహన పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:11:20+05:30 IST