రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఐరాడ్‌’

ABN , First Publish Date - 2022-12-20T23:49:00+05:30 IST

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఐరాడ్‌’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ట్రాన్సపోర్ట్‌ అధికారి శివరామప్రసాద్‌ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఐరాడ్‌’

డీటీసీ శివరామప్రసాద్‌

అనంతపురం అర్బన, డిసెంబరు 20: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఐరాడ్‌’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ట్రాన్సపోర్ట్‌ అధికారి శివరామప్రసాద్‌ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆర్టీఓ సురే్‌షనాయుడు, ఎంవీఐలు రమణారెడ్డి, సునీతతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పోలీసు, రవాణా, వైద్య, హైవే ఇంజనీరింగ్‌ శాఖను అనుసంధానం చేస్తూ ‘ఐరాడ్‌’ యాప్‌ను ఏర్పాటు చేశారన్నారు. రోడ్డు ప్రమాదాలను ముందుగా చూసిన వారు తక్షణమే ప్రమాద సమాచారాన్ని ఐరాడ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. సంబంధింత శాఖ అధికారులకు చేరుతుందని అన్నారు. ఇలా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు సహకరించిన వారి ఖాతాలో ప్రభుత్వం రూ.5వేలు బహుమతిగా జమ చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని ఎక్కువసార్లు అందించిన పది మందికి కేంద్ర ప్రభు త్వం తరపున రూ.లక్ష పారితోషకం అందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్లలో ఐరాడ్‌ యాప్‌ను ఇనస్టాల్‌ చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి దాకా జిల్లాలో 418 రహదారి ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇందులో 238 మంది చనిపోయారని, 404 మంది గాయపడ్డారని తెలిపారు. అతివేగం, ఫోనలో మాట్లాడుతూ వాహనం నడపడం, హెల్మ్‌ట్‌ ధరించకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమని అన్నారు.

Updated Date - 2022-12-20T23:49:06+05:30 IST