జాతీయ యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-03T00:18:52+05:30 IST

కేంద్ర యువజన, క్రీడాశాఖ అందజేసే జాతీయ యువజన అవార్డులకు ఈనెల 6వతేదీలోపు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా, యువజన సంక్షేమ శాఖ అధికారి కేశవనాయుడు తెలిపారు.

జాతీయ యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 2: కేంద్ర యువజన, క్రీడాశాఖ అందజేసే జాతీయ యువజన అవార్డులకు ఈనెల 6వతేదీలోపు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా, యువజన సంక్షేమ శాఖ అధికారి కేశవనాయుడు తెలిపారు. ఆరోగ్య, పరిశోధన, ఆవిష్కరణ, సంస్కృతి, మానవ హక్కుల ప్రచారం, కళ, సాహిత్యం, పర్యాటక, సాంప్రదాయ వైద్యం, క్రియాశీల పౌరసత్వం, సంఘసేవ, క్రీడ, విద్యా నైపుణ్యం, స్మార్ట్‌ లెర్నింగ్‌లో క్షేత్రస్థాయిలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు అందజేస్తారన్నారు. వివరాలకు సెల్‌ నంబరు 9959517370ను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-11-03T00:18:52+05:30 IST
Read more