-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Intelligence DIG visiting Maremma Temple-NGTS-AndhraPradesh
-
మారెమ్మ ఆలయాన్ని సందర్శించిన ఇంటెలిజెన్స డీఐజీ
ABN , First Publish Date - 2022-06-07T06:23:39+05:30 IST
మండలంలోని కరావులపల్లి తండాలోని మారెమ్మ దేవత ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స డీఐజీ నారాయణనాయక్ కుటుంబ సమేతంగా సోమవారం సందర్శించా రు.

గోరంట్ల, జూన 6: మండలంలోని కరావులపల్లి తండాలోని మారెమ్మ దేవత ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స డీఐజీ నారాయణనాయక్ కుటుంబ సమేతంగా సోమవారం సందర్శించా రు. ఆయనకు పుట్టపర్తి రూరల్, గోరంట్ల సీఐలు జయనాయక్, సుబ్బరాయుడు, స్థానిక గిరిజన నాయకులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామి, మారెమ్మ ఆలయాల్లో డీఐజీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో ఆయన మాట్లాడారు. కరావులపల్లి తండాతో తన కుటుంబ అనుబంధాన్ని పంచుకున్నారు. మడకశిర మండ లం గుండుమల తండాకు చెందిన నారాయణనాయక్ గ్రూప్-1 ద్వారా ఏఎస్పీ ఉద్యోగం పొందారు. ఎస్పీగా, రైల్వే శాఖాధికారిగా అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి, గుంటూరు అర్బనలో పని చేశారు. ఏపీ నుంచి డెప్యుటేషనపై తెలంగాణకు వెళ్లి ఇంటెలిజెన్స డీఐజీగా పని చేస్తున్నారు. ఆరు తరాల నుంచి కరావులపల్లి తండాతో తన కుటుంబానికి సంబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. గుండుమల తండాలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ గురువారం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకు లు, జడ్పీటీసీ పాలే జయరాంనాయక్, సర్పంచ వాసుదేవనాయక్, రంగేనాయక్, నాగేనాయక్, లాయర్ తిప్పేనాయక్, చాంప్లాబాబునాయక్, గౌరీమోహననాయక్, రాజేశనాయక్, చలపతినాయక్, జ యచంద్రనాయక్ పాల్గొన్నారు.