వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-03-16T06:05:16+05:30 IST

వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం

-మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 

అనంతపురం అర్బన, మార్చి 15: వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. వైసీపీ 1000 రోజుల పాలనంతా విధ్వంసాలతో సాగిందని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేద,సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనీ, సరైన సమయంతో తగిన బుద్ధి  చెబుతారని హెచ్చరించారు.

Read more