కేజీబీవీలో పనిచేయని నిఘా నేత్రాలు

ABN , First Publish Date - 2022-12-30T00:03:45+05:30 IST

బాలికలు మాత్రమే ఉండే విద్యాల యాల్లో ఎంతో అప్రమత్తత అవసరం. అయితే శింగనమల కేజీబీవీలో మాత్రం అధికారులు దాన్ని మరచిపోయారు.

కేజీబీవీలో పనిచేయని నిఘా నేత్రాలు
శింగనమల కేజీబీవీ

ఏడాది నుంచి నిరుపయోగంగా సీసీ కెమెరాలు

తెలిపినా పట్టించుకోని అధికారులు

శింగనమల, డిసెంబరు29: బాలికలు మాత్రమే ఉండే విద్యాల యాల్లో ఎంతో అప్రమత్తత అవసరం. అయితే శింగనమల కేజీబీవీలో మాత్రం అధికారులు దాన్ని మరచిపోయారు. ఏడాది కాలంగా సీసీ కెమరాలు పనిచేయకపోయినా పట్టించుకోవడం లేదు. ఈనెలలో రెండు సార్లు ఫుడ్‌పాయిజన జరిగింది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం విచా రణ అధికారులకు ఇబ్బందిగా మారింది. శింగనమల కేజీబీవీలో స్కూల్‌తో పాటు జూనియర్‌ కళాశాలలో 253 మంది బాలికలు చదువుతున్నారు ఐదేళ్ల కిందట మూడు సీపీ కెమెరాలను పోలీస్‌ అధికారులు ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి సీసీ కెమెరాలు పనిచేయలేదని సిబ్బంది పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల 2వతేదీ ఫుడ్‌పాయిజనతో 80 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 23న మరోసారి ఫుడ్‌పాయిజన కావడంతో 40 మంది ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలలో సిబ్బంది మధ్య కోల్డ్‌వార్‌తో ఉద్దేశపూర్వకంగా బల్లి మజ్జిగలో వేశారని ఆరోపణలు రావడంతో అక్కడి సిబ్బందితో ఫుడ్‌ పాయిజనపై గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. అదే పాఠశాలలో సీసీకెమెరాలు పనిచేసి ఉంటే మజ్జిగలో బల్లి ఎవరు వేశారో తెలిసేది. అవి పని చేయకపోవడంతో ఏదీ తెలియకుండా పోయింది.

మరమ్మతులు చేస్తున్నారు: ఝాన్సీ, ఎస్‌ఓ

పాఠశాలలో మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అని పనిచేయకపో వడంతో మరమ్మతులు చేయడానికి అధికారులు గురువారం సిబ్బంది పంపారు. మరో రెండు కెమెరాలు కూడా అమర్చనున్నారు.

Updated Date - 2022-12-30T00:03:46+05:30 IST