-
-
Home » Andhra Pradesh » Ananthapuram » In three years the state is twenty years behind-NGTS-AndhraPradesh
-
మూడేళ్లలో రాష్ట్రం ఇరవైఏళ్లు వెనక్కు
ABN , First Publish Date - 2022-04-24T06:34:37+05:30 IST
మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. పట్టణంలోని 35వ వార్డులో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘బాదుడే బాదుడు’లో టీడీపీ నాయకులు
ధర్మవరం, ఏప్రిల్ 23: మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. పట్టణంలోని 35వ వార్డులో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలం భిస్తోం దంటూ ప్రజలకు వివరించారు. గత టీడీపీ పాలన కు, ప్రస్తుత వైసీపీ పాలనకు వ్యతాసాన్ని వివరించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అ న్నింటి పై ధరలు పెంచుతూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో 35వ వార్డు టీడీపీ ఇనచార్జ్ తోట నారాయణస్వామి, నాయకులు పరిసే సుధా కర్, గోసల శ్రీరాములు, చింత లక్ష్మీనారాయణ, సీబీఎన రామకృష్ణ, రాయ పాటి శివ, ఐటీడీపీ సభ్యులు నాగేంద్ర, శివరాం, కమిటీ సభ్యులు వహీద తదితరులు పాల్గొన్నారు.