-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Immediate steps should be taken to store flood water-NGTS-AndhraPradesh
-
వరద నీటి నిల్వకు తక్షణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-09-10T05:48:37+05:30 IST
జిల్లాలో వరద నీటిని నిల్వ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 9: జిల్లాలో వరద నీటిని నిల్వ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక గణేనాయక్‌భవనలో విలేక రుల తో మాట్లాడారు. జిల్లాలో దాదాపు 40 సంవ త్సరాల తర్వాత భారీ వర్షాలు రావడం, కర్ణాటక రాష్ట్రంలో నుంచి వస్తున్న వరద నీటితో డ్యామ్ లు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నా యన్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు వృథాగా కిం దికి వెళ్లిపోవడం విషాదమన్నారు. ఇప్పటికే 15 టీఎంసీల నీరు కిందికి వదిలేశారని తెలిపారు. గతేడాది చిత్రావతి నుంచే దాదాపు 25 టీఎంసీ ల నీరు వృథాగా వదిలేయాల్సి వచ్చిందన్నారు. ఇందుకు ప్రధాన కారణం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడమేనన్నారు. జలవనరుల శాఖ ఈఎనసీ నుంచి సమాంతర కాలువ నిర్మా ణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికా రులకు ఆదేశాలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామ మన్నారు. పీఏబీఆర్ డ్యామ్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ సరిపడా భూమి లేక 5 టీఎంసీల లోపు మాత్రమే నీటిని నిల్వ చేసుకోవాల్సి వస్తోందన్నారు. మిగిలిన 5 టీఎంసీల నీరు కూడా నిలువ చేసుకునేందుకు అవసరమైన భూసేకరణ వెంటనే చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయాలని కోరారు. రాయదుర్గం ప్రాంతంలో ఉంతకల్లు రిజర్వాయర్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలన్నా రు. తుంగభద్ర డ్యామ్ నుండి హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు వస్తున్న 32.5 టీఎంసీలను పూర్తిగా తీసుకునేందుకు కాలువ ఆధునికీకకరణ గత 14 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.