రాహుల్‌గాంధీ పాదయాత్రలో పాల్గొంటా : రఘువీరా

ABN , First Publish Date - 2022-10-12T05:25:48+05:30 IST

రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత జోడో పాదయాత్రలో తాను పాల్గొంటానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎన.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీ పాదయాత్రలో పాల్గొంటా : రఘువీరా

మడకశిర, అక్టోబరు 11: రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత జోడో పాదయాత్రలో తాను పాల్గొంటానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎన.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఆయన పాదయాత్రలో పాల్గొనడం తన బాధ్యతని కూడా ఆయన పేర్కొన్నారు. మంగళవారం గోవిందాపురం, గంగులవాయిపాళ్యం పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులతో నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన అనంతపురం జిల్లాలోకి రాహుల్‌  పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఆ యాత్రలో తాను నీలకంఠాపురం దేవస్థానం తరపున పాల్గొంటానన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను రాహుల్‌గాంధీకి అందజేస్తానని తెలిపారు. నీలకంఠాపురంలో ఆలయాల పనులు చాలా ఉన్నాయన్నారు. ఆలయ పనులు పూర్తయిన తర్వాత అనుచరులతో కలసి ఓ నిర్ణయం తీసుకుంటానని రఘువీరా వెల్లడించారు. అంతవరకూ తాను రాజకీ యాల జోలికి వెళ్లనని, దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రలో పాల్గొనేందుకు ఎవరికివారు స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు.

Read more