ఎన్నాళ్లకు అక్రమాలను నియంత్రిస్తారు?

ABN , First Publish Date - 2022-11-24T23:53:23+05:30 IST

అక్రమ కట్టడాలు నిర్మిస్తే... వాటిని కూల్చివేస్తామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేరా..?ఎన్నాళ్లకు అక్రమాల ను నియంత్రిస్తారు...? అంటూ మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ పీవీవీఎస్‌ మూర్తి కమిషనర్లపై అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నాళ్లకు అక్రమాలను నియంత్రిస్తారు?

ఉభయ జిల్లాల కమిషనర్లతో ఆర్డీ పీవీవీఎస్‌ మూర్తి

అనంతపురం క్రైం, నవంబరు24: అక్రమ కట్టడాలు నిర్మిస్తే... వాటిని కూల్చివేస్తామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేరా..?ఎన్నాళ్లకు అక్రమాల ను నియంత్రిస్తారు...? అంటూ మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ పీవీవీఎస్‌ మూర్తి కమిషనర్లపై అసహనం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని రామ్‌నగర్‌లో ఉన్న మున్సిపల్‌ ఆర్డీ కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో అనంతపురం కార్పొరేషన కమిషనర్‌తో పాటు ఉభయ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆర్డీ సమీక్షించారు. అనంతరం ఆర్డీ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఉపేక్షించవద్దన్నారు. అలాంటి వాటిని గుర్తించి నోటీసులు ఎందుకివ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇక సచివాలయ సిబ్బందితో పనిచేయించుకోలేక పోతే మీరే ఫెయిలైనట్లని స్పష్టం చేశారు. వాళ్ల విధులను సద్వినియోగం చేసుకోవాల న్నారు. పారిశుధ్యం నుంచి ఇంజనీరింగ్‌ పనులు, టౌనప్లానింగ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాల వరకు ప్రతి అంశంలోనూ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలన్నారు. పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌ ఫైల్స్‌, ఆనలైనలో ఉన్న ఫైల్స్‌ విషయంలోనూ అలసత్వం తగదన్నారు. కార్యక్రమంలో నగరకమినర్‌ భాగ్యలక్ష్మి, అడిషనల్‌ కమిషనర్‌ రమణారెడ్డి, శేషన్న, వెంకటేశ్వర్లు, దివాకర్‌, నాగరాజు, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

=======================================

Updated Date - 2022-11-24T23:53:23+05:30 IST

Read more