-
-
Home » Andhra Pradesh » Ananthapuram » How is the city panchayat made the district headquarters-NGTS-AndhraPradesh
-
నగర పంచాయతీని జిల్లాకేంద్రంగా ఎలా చేస్తారు?
ABN , First Publish Date - 2022-02-19T06:03:29+05:30 IST
వందేళ్ల చరిత్ర ఉన్న హిం దూపురం మున్సిపాలిటీని కాదని, చిన్న నగర పంచాయతీ అయిన పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ఎలా చేస్తారంటూ టీఎనఎస్‌ఎఫ్ నా యకులు ప్రశ్నించారు.

రిలే దీక్షల్లో టీఎనఎస్‌ఎఫ్ నాయకులు
పట్టుగూళ్ల రీలర్ల పోస్టుకార్డు ఉద్యమం
హిందూపురం టౌన, ఫిబ్రవరి 18: వందేళ్ల చరిత్ర ఉన్న హిం దూపురం మున్సిపాలిటీని కాదని, చిన్న నగర పంచాయతీ అయిన పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ఎలా చేస్తారంటూ టీఎనఎస్‌ఎఫ్ నా యకులు ప్రశ్నించారు. హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా ప్రకటించాలంటూ వైసీపీ యేతర అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. అన్ని విద్యాసంస్థలున్న హిందూపురాన్ని కాకుండా పుట్టపర్తిని జిల్లాకేంద్రం చేయడంతో ఇక్కడ విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, పార్లమెంట్ కేంద్రాన్నే జిల్లాకేంద్రం చేస్తామని చె ప్పిన సీఎం జగన ఎందుకు మాట తప్పారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి హిందూపురాన్ని జిల్లాకేంద్రం చే యాలన్నారు. దీక్షకు నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, బాలాజీ మనోహర్, రమేష్, ఫారూక్, సతీష్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు నరేంద్ర, అభి, మూర్తి, సతీష్, యుగంధర్, శ్రీనాథ్ పాల్గొన్నారు. అదేవిధంగా పట్టుగూళ్ల రీలర్లు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. స్థానిక పట్టుగూళ్ల మార్కెట్‌లో రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు రీలర్ల చేత పోస్టుకార్డుల లేఖలను ముఖ్యమంత్రికి పంపించారు. తెలుగు రాష్ట్రాల్లోనే పురం పట్టుగూళ్ల విక్రయ కేంద్రం అతిపెద్దదన్నారు. దీంతో ఇక్కడే జి ల్లాకేంద్రం ఏర్పాటు చేయాలని రీలర్లు కోరారు.