డైట్‌ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్‌డే

ABN , First Publish Date - 2022-11-30T00:03:30+05:30 IST

నూతన విద్యాసంవత్సరానికి సంబంధించి ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల కోసం మంగళవారం బుక్క పట్నం శిక్షణా కేంద్రంలో ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

డైట్‌ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్‌డే

బుక్కపట్నం, నవంబరు 29: నూతన విద్యాసంవత్సరానికి సంబంధించి ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల కోసం మంగళవారం బుక్క పట్నం శిక్షణా కేంద్రంలో ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాసంవత్సరం 2022-24కు స్వాగతం పలుకుతూ... అటు పూర్వవిద్యార్థులు, ఇటు అధ్యాపకులు కొత్త విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పా టుచేసిన సమావేశంలో డైట్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ మాట్లాడుతూ... విద్యార్థులు ఆదర్శవంతంగా ఉండి పలువురి మన్ననల ను పొందాలన్నారు. అదే సమయంలో సమయపాలన పాటిస్తూ కళాశాలకు రావాలన్నారు. రాష్ట్రంలో ఇతర కళాశాలలతో పోలిస్తే బుక్కపట్నం డైట్‌ కళాశాలకు ప్రాధాన్యత ఉందన్నారు. సత్యసాయి ఆశీస్సులతో నేటి వరకు బుక్కపట్నం కళాశాలలో శిక్షణ పొందిన విద్యార్థులు మంచిస్థానంలో ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి ఉపాధ్యాయులుగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హరినాథ్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, అస్లాంబాష, సురేశబాబు, శ్రీనివాసప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:03:30+05:30 IST

Read more