ఆటో కార్మికులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-13T00:10:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను నిలువు దోపిడీ చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఆటో కార్మికులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 12: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను నిలువు దోపిడీ చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా కార్మిక కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తూ కార్మికులపై పన్నుల రూపంలో అదనపు భారాలు మోపుతోందన్నారు. సీఐటీయూ జిల్లా నాయకుడు ఆర్‌వీ నాయుడు మాట్లాడుతూ ఈ-చలానాలు రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముర్తుజా, ఆటో యూనియన నాయకులు మంజు, గురురాజు, నాగరాజు, ఆజాం బాషా, ఆదినారాయణ, శివప్రసాద్‌, ఇర్ఫాన, వెంకటరాముడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:10:19+05:30 IST

Read more