ఘనంగా శివపార్వతుల కల్యాణం

ABN , First Publish Date - 2022-11-20T23:55:37+05:30 IST

పట్టణంలోని చెరువుకట్ట వీధిలోగల శ్రీకాశీవిశ్వనాథ స్వామి ఆలయంలో ఆదివారం గాయత్రి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణోత్స వాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

ధర్మవరం, నవంబరు 20: పట్టణంలోని చెరువుకట్ట వీధిలోగల శ్రీకాశీవిశ్వనాథ స్వామి ఆలయంలో ఆదివారం గాయత్రి బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణోత్స వాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిపూజ, పుణ్యాహవాచనం, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేదపండితులు జగదీశశర్మ, ద్వారకనాథ్‌శర్మ, దేవరకొండ కిశోర్‌ బాబు, భరతసింహ నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వేదమంత్రాలు, మంగళవాయుద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - 2022-11-20T23:55:37+05:30 IST

Read more