అర్హులకు మాత్రమే ఓటు హక్కు కల్పించండి : భూమిరెడ్డి

ABN , First Publish Date - 2022-11-08T00:01:56+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి తెలిపారు.

అర్హులకు మాత్రమే ఓటు హక్కు కల్పించండి : భూమిరెడ్డి

రాప్తాడు, నవంబరు7: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాప్తాడులో తహసీల్దార్‌ లక్ష్మీనాయక్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ మల్లికార్జునను ఆయన కలిశారు. రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారని, స్థానిక బీఎల్‌ఓలు గ్రామాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి వారి డిగ్రీ సర్టిఫికెట్లు పరిశీలించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని సర్టిఫికెట్లు కార్యాలయాల వద్దకే తీసుకురమ్మని బీఎల్‌లు చెప్పకూడదన్నారు. అనంతరం ఎంపీడీఓ సాల్మనరాజ్‌, అధికారులకు ప్రచార పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ కొండప్ప, శ్రీనివాసులు, గంగలకుంట కిష్టా పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:02:08+05:30 IST

Read more