ఉపాధ్యాయులు, విద్యార్థుల ఔదార్యం

ABN , First Publish Date - 2022-05-24T05:35:20+05:30 IST

ఇటీవల ట్రాక్టర్‌ కిందపడి మృతిచెందిన అత్తిరాళ్లదిన్నె గ్రామానికి చెంది న నాగరాజు కుటుంబ సభ్యులకు రూ.13700 నగదు సహాయాన్ని అం దించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు

ఉపాధ్యాయులు, విద్యార్థుల ఔదార్యం

యాడికి, మే23: ఇటీవల ట్రాక్టర్‌ కిందపడి మృతిచెందిన అత్తిరాళ్లదిన్నె గ్రామానికి చెంది న నాగరాజు కుటుంబ సభ్యులకు రూ.13700 నగదు సహాయాన్ని అం దించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు యాడికి హైస్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు. పెద్దపప్పూరు మండలం అత్తిరాళ్లదిన్నె గ్రామానికి చెందిన కూలీ నాగరాజు ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి మృతిచెందాడు. నాగరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. గ్రామానికి చెందిన యాడికి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విశ్వనాథ్‌ తన తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల చొరవతో విరాళాన్ని సేకరించారు.


Read more