గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం : టీడీపీ

ABN , First Publish Date - 2022-10-03T06:34:26+05:30 IST

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరా జ్యం వైసీపీ పాలనలో నిర్వీర్యమైందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం : టీడీపీ
హిందూపురంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న టీడీపీ నాయకులు

జగనకు మంచి బుద్ధి ప్రసాదించాలని విగ్రహానికి వినతులు


హిందూపుం, అక్టోబరు 2: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరా జ్యం వైసీపీ పాలనలో నిర్వీర్యమైందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానికంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యంలో కీలకమైన సర్పంచులకు అధికారాలు లేకుండా కత్తిరించడం దుర్మార్గమన్నారు. గ్రామ సచివాలయాల ను సర్పంచు కిందకు తీసుకురావాలన్నారు. ఉపాధిహామీ పనులు, విధుల ను పంచాయతీల ఆధీనానికి ఇవ్వాలన్నారు. సీఎం జగన సర్పంచుల అధికారాలు, విధులు, నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. అదేవిధంగా పట్టణంలోని ఐదు లాంతర్లు, సూగూరు క్రాస్‌ వద్ద గాంధీ విగ్రహాలకు టీ డీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీ డీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆ నంద్‌, నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్‌ నరసింహయాదవ్‌, జిల్లా నాయకులు అమర్‌నాథ్‌, రమేష్‌, బీసీ సెల్‌ రవీంద్రనాయుడు, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, స తీష్‌, నాయకులు డైమండ్‌ బాబా, శ్రీనివాసరెడ్డి, నవీన, అంజి, హెచఎన రాము, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మడకశిర టౌన: పంచాయతీ సర్పంచుల న్యాయబద్ధమైన 11 డిమాం డ్లు పరిష్కరించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న కోరారు. ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. జగనరెడ్డి ప్రభుత్వం గాంధీ జీ కలలను కాలరాస్తోందని విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీ ర్యం చేశారని ఆరోపించారు. పంచాయతీ నిధులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని వి మర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వత్థామ ప్ప, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు రాజగోపాల్‌, మండల కన్వీనర్‌ రామాంజనేయులు,  మాజీ మున్సిపల్‌ చైర్మన ప్రకాష్‌, నాయకులు ఈశ్వర్‌సాగర్‌, మంజునాథ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


అదేవిధంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆధ్వ ర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘మహాత్ముడా.. నువ్వయినా జగనకు మంచి బుద్ధి ప్రసాదించు. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయకుం డా, గ్రామాల అభివృద్ధికి కృషి చేసేలా బుద్ధి ప్రసాదించు’ అంటూ గాంధీ వి గ్రహానికి విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధులను ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటోందన్నారు. గ్రామాల అ భివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలను దెబ్బతీయడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను స్వలాభం కోసం దారి మళ్లించారని, సర్పంచుల అధికారాన్ని సైతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి, గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, జిల్లా లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, జిల్లా బీసీసెల్‌ అ ధికార ప్రతినిధి నాగరాజు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు భక్తర్‌, పట్టణ అధ్యక్షులు మనోహర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు సుబ్బరాయుడు, నరసింహరా జు, ప్రధాన కార్యదర్శి బేగార్లపల్లి రవి పాల్గొన్నారు. 


పెనుకొండ:  స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకటరాముడు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంత రం గాంధీ సర్కిల్‌లోని గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, నాయకులు మాధవనాయుడు, బొక్సంపల్లి రామక్రిష్ణ, కేశవయ్య, అశ్వత్థప్ప, త్రివేంద్ర, బాబుల్‌రెడ్డి, గుట్టూ రు నాగరాజు, ఈశ్వర్‌ ప్రసాద్‌, సిద్దయ్య, ఆదిశేషు, చంద్రకాంతమ్మ, అనసూయమ్మ, రామలింగ, రవి, రఘు, సిద్దయ్య, రమేష్‌, పోతిరెడ్డి, త్రివేంద్రనాయుడు, సర్పంచులు శ్రీనివాసులు, నరసింహులు, మంజునాథ్‌, నాగరా జు, మంజు, నరసింహమూర్తి, నాగరాజు, కన్నాస్వామి, సుబ్రహ్మణ్యం, తోటగేరి శీన, బాబుల్‌రెడ్డి పాల్గొన్నారు. 


అగళి: మండలకేంద్రంలో టీడీపీ జడ్పీటీసీ ఉమేష్‌ ఆధ్వర్యంలో గాంధీజయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

Read more