రేపటి నుంచి ‘ఇదేం ఖర్మ’ : టీడీపీ

ABN , First Publish Date - 2022-11-30T23:28:49+05:30 IST

తెలుగుదేశం పా ర్టీ ఆధ్వర్యం లో శుక్రవారం మం డలంలోని గర్శినపల్లి నుంచి ఇదేం ఖర్మ కా ర్యక్రమం ప్రా రంభిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.

రేపటి నుంచి ‘ఇదేం ఖర్మ’ : టీడీపీ

బత్తలపల్లి, నవంబరు30: తెలుగుదేశం పా ర్టీ ఆధ్వర్యం లో శుక్రవారం మం డలంలోని గర్శినపల్లి నుంచి ఇదేం ఖర్మ కా ర్యక్రమం ప్రా రంభిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. వారు బుధవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మండలంలోని గర్శినపల్లి గ్రామం నుంచి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలకన్వీనర్‌ నారాయణరెడ్డి, చల్లాశ్రీనివాసులు, డేరంగుల ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:29:15+05:30 IST

Read more