-
-
Home » Andhra Pradesh » Ananthapuram » From the students They are complaining that they have not collected the money-MRGS-AndhraPradesh
-
విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయలేదని వేధిస్తున్నారు
ABN , First Publish Date - 2022-09-20T05:27:19+05:30 IST
హాస్టల్ విద్యార్థుల నుంచి డ బ్బులు వసూలు చేసి ఇవ్వలే దని గాండ్లపెంట వార్డెన, మరి కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు తనను వేధిస్తు న్నారని కదిరి బీసీ బాయిస్ కాలేజీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పం దనలో ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌కు హెచడబ్ల్యూఓ సరస్వతి ఫిర్యాదు, నిరసన
పుట్టపర్తి, సెప్టెంబరు 19: హాస్టల్ విద్యార్థుల నుంచి డ బ్బులు వసూలు చేసి ఇవ్వలే దని గాండ్లపెంట వార్డెన, మరి కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు తనను వేధిస్తు న్నారని కదిరి బీసీ బాయిస్ కాలేజీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పం దనలో ఫిర్యాదు చేశారు. అనం తరం జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యా లయం వద్దకు చేరుకొని తల్లితో పాటు నిరసన చేపట్టారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. కానీ విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి ఇవ్వనందుకే వి ద్యార్థి సంఘాల నాయకులు కొందరు విద్యార్థులతో తనకు వ్యతిరేకంగా ధర్నా చేయంచి, అసభ్యపదజాలంతో దూషించి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మలాజ్యోతి సైతం తనకు వ్యతిరేకంగా కలెక్టరుకు ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని ఐనప్పటికీ హాస్టల్ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానని, అందరూ నాపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్డెన విధులు సక్రమంగా నిర్వహించలేదు - నిర్మలాజ్యోతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
వార్డెన తన విధులను సక్రమంగా నిర్వహించకపోగా... సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్లు, అసభ్యపదజాలంతో దూషించినట్లు నా విచారణలో తేలింది. ఇదే విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లానే తప్ప ఆమెపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు చేపట్టలేదు.