ఇక నుంచి ప్రజలతోనే మన పయనం

ABN , First Publish Date - 2022-11-30T00:07:23+05:30 IST

ఇక నుంచి మన పయనం ప్రజల తోనే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ పేర్కొన్నారు.

ఇక నుంచి ప్రజలతోనే మన పయనం

- మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌

గుంతకల్లుటౌన్‌, నవంబరు29: ఇక నుంచి మన పయనం ప్రజల తోనే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ పేర్కొన్నారు. స్ధానిక తిలక్‌నగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పామిడి పట్టణ, మండల టీడీపీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జితేంద్ర గౌడ్‌ మాట్లాడుతూ గురువారం నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం లో తిరిగి మన రాష్ట్ర పరిస్థితి, జగన్‌ ప్రభుత్వం మన టీడీపీ నాయకులను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నదో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నాయకులకు హితువు పలికారు.

Updated Date - 2022-11-30T00:07:23+05:30 IST

Read more