నిరుద్యోగభృతి ఇవ్వకుండా మోసం

ABN , First Publish Date - 2022-10-05T04:20:58+05:30 IST

నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను నట్టేట ముంచిన జగనరెడ్డికి పట్టభద్రులైన యువత తగిన బుద్దిచెప్పాలని టీడీపీ ధర్మవరం మం డల నాయకులు విమర్శించారు.

నిరుద్యోగభృతి ఇవ్వకుండా మోసం
గొట్లూరులో ఓటరు నమోదుపై సమీక్షిస్తున్న టీడీపీ నాయకులు


సీఎం జగనపై టీడీపీ నాయకుల విమర్శ

ధర్మవరంరూరల్‌, అక్టోబరు4: నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను నట్టేట ముంచిన జగనరెడ్డికి పట్టభద్రులైన యువత తగిన బుద్దిచెప్పాలని టీడీపీ ధర్మవరం మం డల నాయకులు విమర్శించారు. టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ ఆదేశా ల మేరకు మంగళవారం రాయలసీమ పట్టభ ద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై గొట్లూ రు, నాగలూరు, బడన్నపల్లి, గరుడంపల్లి, పో తుకుంట గ్రామాల్లో మండల కన్వీనర్‌ పోతు కుంట లక్ష్మన్న, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, సీనియర్‌నాయకుడు గొట్లూరు శ్రీనివాసులు, విజయసారథి,  రాంపురం శీన, గొట్లూరు అనిల్‌గౌడ్‌ పలు గ్రామాల్లోని పట్టభద్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  పట్టభద్రుల జాబితాతో గ్రామాల వారీ గా ఓటరు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు పార్టీతరపున పట్టభద్రుల అభ్యర్థిగా రామగోపాల్‌రెడ్డి ప్రకటించారని, గ్రామా ల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులను గుర్తించి వారు ఓటరు నమోదు చేసుకోవడానికి సహకరించాలన్నారు. నిరుద్యోగులకు పుస్తకాలు, ఇతరత్రా ఖర్చుల కోసం చంద్రబాబు గతంలో నిరు ద్యోగ భృతి ఇచ్చి ఆదుకున్నారని, జగనరెడ్డి సీఎం కాగానే దానిని ఇవ్వకుండా తీవ్రం మోసం చేశార న్నారు. చంద్రబాబు బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే భవిష్యత్తులో పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేయ వచ్చన్నారు. గ్రామాల్లో పార్టీ అభ్యర్థిపై పట్టభద్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధికారప్రతినిధి అమరసుధాకర్‌నాయుడు, బొంత చిరంజీవి, నాగలూరు లింగప్ప, గరుడంపల్లి చంద్రశేఖర్‌, అతకల్లప్ప, పోతుకుంటరమేష్‌, హరికుమార్‌, బడన్నపల్లిక్రిష్ట, జనార్దన, గరుడంపల్లి చండ్రాయుడు, నారాయణస్వామి, అమరేంద్ర, రఫీ, గంగాధర్‌, రజక శ్రీరాము లు, మల్కాపురం సూర్యనారాయణరెడ్డి, రామ్మోహన, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-05T04:20:58+05:30 IST