మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన మృతి

ABN , First Publish Date - 2022-10-05T04:06:06+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన నారాయణరెడ్డి (80) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు.

మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన మృతి
నారాయణరెడ్డి (ఫైల్‌)

టీడీపీ నాయకుల సంతాపం


హిందూపురం, అక్టోబరు 4: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన నారాయణరెడ్డి (80) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. ఈయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశారు. సీసీ వెంకటరాముడుకు కుడిభుజంగా పనిచేశారు. సీసీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ చైర్మనగా పనిచేశా రు. అప్పట్లో ఆయన రైతులకు ఎన్నో సౌకర్యాలు కల్పించడంలో కీలకంగా పనిచేశారు. నారాయణ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతి విష యం ఎమ్మెల్యేకు ఫోనలో తెలపగా, వెంటనే కుటుంబ సభ్యుల ను ఫోనలో పరామర్శించారు. అదేవిధంగా సీసీ వెంకటరాముడు ఇంటివద్దకు వెళ్లి కు టుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుని విలపించారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లకుంట అంజినప్ప, అంబికా లక్ష్మీనారాయణ, డీఈ రమేష్‌, పామిశెట్టి శేఖర్‌, అశ్వత్థనారాయణరెడ్డి, చంద్రమోహన, లింగారెడ్డి, హెచఎన రాము తదితరులు ఇంటివద్దకు వెళ్లి పరామర్శించారు. నారాయణరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 


Read more