పొట్టలో చేపముల్లు సులువుగా బయటికి..!

ABN , First Publish Date - 2022-08-25T05:38:16+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు.

పొట్టలో చేపముల్లు సులువుగా బయటికి..!
బాధితుడు హరిబాబుతో ఆపరేషన చేసిన ఆస్పత్రి వైద్యులు

 పెద్దాస్పత్రిలో వైద్యుల అరుదైన చికిత్స

 అనంతపురం టౌన ఆగస్టు 24: జిల్లా సర్వజన ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. ల్యాప్రోస్కోపి విధానంలో కడుపులో నుంచి చేపముల్లును బయటకి తీశారు. జనరల్‌ సర్జన విభాగం హెచఓడీ డాక్టర్‌ రామకృష్ణనాయక్‌ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. పెద్దవడగూరు మండలం విరుపాపురానికి చెందిన హరిబాబు కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు వైద్యులు స్కానింగ్‌ చేయగా, కడుపులో చేపముల్లు ఉన్నట్లు తేలింది. దీంతో జనరల్‌ సర్జన హెచఓడీ రామకృష్ణనాయక్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ జయరాజు, డాక్టర్‌ శివశంకర్‌ నాయక్‌, డాక్టర్‌ శంకర్‌, డాక్టర్‌ హరిబాబు, అనస్థీషియా వైద్యులు సుబ్రమణ్యం, మధు, శ్రావణి, రామశివ బృందంగా ఏర్పడి హరిబాబు సమస్య గురించి చర్చించుకున్నారు. కోత లేకుండా, ల్యాపోస్కోపీ ద్వారా యంత్రం పంపించి చేపముల్లును బయటకు తీయాలని నిర్ణయించారు. వైద్యబృందం బాధితుడి కడుపు నుంచి మంగళవారం చేపముల్లును బయటకు తీసింది. ప్రస్తు తం హరిబాబు ఆరోగ్యంగా ఉన్నారు. గతంలో ఇలాంటి చేపముళ్లను బయటకు తీయాలంటే కడుపు కోయాల్సి వచ్చేదని డాక్టర్‌ రామకృష్ణనాయక్‌ తెలిపారు. ఇప్పుడు కొత్తటెక్నాలజీతో ల్యాపోస్కోపీ ద్వారా యంత్రం పంపించి ముల్లును బయటకు తీశామని తెలిపారు. దీంతో రోగికి ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. అందుకే త్వరగా కోలుకున్నారని తెలిపారు. ఈ విధానం విజయవంతం కావడంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేసింది. వీరిని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ వైవీ రావు, డాక్టర్‌ విజయమ్మ అభినందించారు. 




Updated Date - 2022-08-25T05:38:16+05:30 IST