-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Fear is fear-MRGS-AndhraPradesh
-
భయం భయంగా..!
ABN , First Publish Date - 2022-09-18T05:19:55+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శింగనమల మండలం సోదనపల్లి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. సోదనపల్లి-పోతురాజు కాల్వ మధ్య రోడ్డు కోతకు గురైంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శింగనమల మండలం సోదనపల్లి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. సోదనపల్లి-పోతురాజు కాల్వ మధ్య రోడ్డు కోతకు గురైంది. దీంతో గ్రామంలోని జడ్పీ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వంకను దాటేందుకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. స్థానికులు డ్రిప్పు వైరును వంకమీదుగా ఏర్పాటు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని రోజూ పదుల సంఖ్యలో విద్యార్థులు వంక దాటుతున్నారు. డ్రిప్పు వైరు తెగిపోతే విద్యార్థులకు ప్రమాదం తప్పదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
- శింగనమల