పాడిరైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-12T05:33:40+05:30 IST

మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన పాడిరైతు చెలిమి వెంకటరామయ్య(50) ఊజిమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు

పాడిరైతు ఆత్మహత్య
చెలిమి వెంకటరామయ్య (ఫైల్‌)

ధర్మవరం రూరల్‌, అక్టోబరు 11: మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన పాడిరైతు చెలిమి వెంకటరామయ్య(50) ఊజిమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెలిమి వెంకటరామయ్య పాడిఆవులను పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. రెండేళ్ల నుంచి ఆయన కడుపునొప్పితో బాధపడేవాడు. ఇటీవలే తిరుపతిలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయినప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో వెంకటరామయ్య మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఊజీమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య భారతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


Read more