-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Farmer difficulty is soil-MRGS-AndhraPradesh
-
రైతు కష్టం నేలపాలు
ABN , First Publish Date - 2022-09-11T05:11:52+05:30 IST
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రై తులు సాగుచేసిన టమోటా పంట పశువుల మేతగా మారింది. మండలంలోని అడదాకులపల్లికి చెందిన రైతులు సాగుచేసిన టమోటా పంటను మార్కెట్‌కు తరలించి, గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాల పాలయ్యారు.

అడదాకులపల్లిలో పశువుల మేతగా టమోటా
పెనుకొండ రూరల్, సెప్టెంబరు 10: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రై తులు సాగుచేసిన టమోటా పంట పశువుల మేతగా మారింది. మండలంలోని అడదాకులపల్లికి చెందిన రైతులు సాగుచేసిన టమోటా పంటను మార్కెట్‌కు తరలించి, గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాల పాలయ్యారు. విధిలేక టమోటాను పశువులకు మే తగా వేశారు. రైతు రాజు మాట్లాడుతూ తనకున్న మూడెకరాల్లో రూ.1.5 లక్షలు వె చ్చించి టమోటా పంట సాగుచేశామన్నారు. మార్కెట్‌లో ధర ఉన్నప్పటికీ ఇటీవల కు రుస్తున్న వర్షాలకు టమోటా పంట అంతా దెబ్బతిందన్నారు. పంటను కోత కోసి కర్ణా టకలోని బాగేపల్లి మార్కెట్‌కు తరలించినట్లు తెలిపారు. మార్కెట్‌లో నోసేలింగ్ బోర్డు లు ప్రదర్శించారు. దీంతో దిక్కుతోచక పంటన పొలంలోనే పశువులకు మేతగా పడేశామన్నారు. దాదాపు రూ.లక్ష వరకు ఆస్తినష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభు త్వం స్పందించి టమోటా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.