అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

ABN , First Publish Date - 2022-10-02T05:16:01+05:30 IST

తన పొలంలో నిద్రిస్తున్న మండలంలోని నడిమిగడ్డపల్లి తూర్పు తండాకు చెందిన రైతు డుంగా వత బద్దేనాయక్‌(55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
డుంగావత బద్దేనాయక్‌ మృతదేహం చెంపమీద, మెడవద్ద గాయాలు


ధర్మవరం రూరల్‌, అక్టోబరు 1: తన పొలంలో నిద్రిస్తున్న మండలంలోని నడిమిగడ్డపల్లి తూర్పు తండాకు చెందిన రైతు డుంగా వత బద్దేనాయక్‌(55) అనుమానాస్పద స్థితిలో  మృతిచెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బద్దేనాయక్‌ గ్రామ సమీపంలోని నేలకోట రోడ్డు వద్ద తనకున్న 2.60ఎకరాల్లో ఒక ఎకరాలో ద్రాక్ష, మిగతా పొలంలో వేరుశనగ సాగుచేశాడు. ప్రస్తుతం ఎకరాలో ఉన్న వేరుశనగను తొలిగించి కాయలు ఆడించి పొలంలోనే రాశి పోశాడు. వాటికి కాపలాగా శుక్రవారం రాత్రి 9గంటల సమ యంలో  పొలంలోకి వెళ్లాడు. అయితే  మంచం మీద నుంచి కింద పడి మరణించి ఉన్నట్లు ఉదయం సమీపతోటల రైతులు బద్దేనాయక్‌ కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతిచెందిన బద్దేనాయక్‌ మొహంపై ఎడమవైపు చెంపపై కందుబారింది. అదేవిధంగా కు డిచెవిలో నుంచి రక్తం కారుతూ, మెడ పై కందుబారిన ఆనవాలు కనిపించా యి. దీంతో మృతిపట్ల వారు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ ఇనచార్జ్‌ సీఐ చిన్నగౌస్‌, ఇనచార్జ్‌ ఎస్‌ఐ శ్రీహర్ష సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మమ్మ పదేళ్ల క్రితమే మృతిచెందగా ఇద్దరు కుమారులు రవినాయక్‌, కుళ్లాయప్ప నాయక్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా నెలక్రితం బద్దేనాయక్‌ పొలంలో ఉన్న  16ద్రాక్ష చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశా రని కుమారులు తెలిపారు.  పోలీసులు డ్వాగ్‌స్కాడ్‌, క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. బద్దేనాయక్‌ కుమారుడు రవినాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు న మోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు బద్దేనాయక్‌ను ఎవరైనా గొంతునులిమి చంపారా..? లేక ఏదైనా ప్రమాదంతో మృతిచెందాడా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


Read more