విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-11-24T23:40:25+05:30 IST

కళ్యాణదుర్గం మండల హు లికల్లులో రైతు వడ్డె రామాంజినేయులు (48) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. తోటలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన, మోటర్‌ ఆన కాకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌లో ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
రామాంజినేయులు (ఫైల్‌)

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌), నవంబరు 24: కళ్యాణదుర్గం మండల హు లికల్లులో రైతు వడ్డె రామాంజినేయులు (48) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. తోటలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన, మోటర్‌ ఆన కాకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌లో ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రైతుకు భార్య రామాంజిన మ్మ, కుమారులు వన్నూరుస్వామి, అనిల్‌ ఉన్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2022-11-24T23:40:25+05:30 IST

Read more