ఈ-క్రాపింగ్‌ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-09-14T05:27:00+05:30 IST

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల ఈక్రాపింగ్‌ నమోదుకు ఈనెల 25వతేదీ వరకు గడువు పొడిగిచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్‌ పేర్కొన్నారు.

ఈ-క్రాపింగ్‌ గడువు పొడిగింపు

ఈనెల 25వరకు అవకాశం 

అనంతపురం అర్బన, సెప్టెంబరు 13: ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల ఈక్రాపింగ్‌  నమోదుకు ఈనెల 25వతేదీ వరకు గడువు పొడిగిచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ నుంచి వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ జిల్లా వ్యవసాయ అధికారులు, ఏడీఏలు,ఏఓలతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. అనంతరం వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఇప్పటి దాకా 9.36 లక్షల ఎకరాల్లో ఈ క్రాపింగ్‌ పూర్తి చేశామన్నారు. గడువుపొడిగించిన నేపథ్యంలో నిర్దేశించిన తేదీలోగా వందశాతం పూర్తి చేసేలా చొరవచూపాలన్నారు. ఈక్రాపింగ్‌లో తప్పి దాలు జరిగితేసంబంధిత అధికారులు,సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఎం కిసాన లబ్ధిదారులతో ఈకేవైసీ నమోదు కూడా ఈనెల 18 వరకు అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో 3.25 లక్షల మంది పీఎం కిసాన లబ్దిదారులు ఉండగా ఇప్పటివరకు 2.25 లక్షలమంది ఈకేవైసీ చేయించుకున్నారన్నారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి పెండింగ్‌లోని ఫైళ్లను కూడా రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 


Read more